సుధా నారాయణమూర్తిపై అసత్య ప్రచారం.. ఫిర్యాదు చేసిన టీటీడీ

Bad propaganda on Sudha Narayanamurthy
  • టీటీడీ బోర్డు సభ్యురాలిగా రాజీనామా చేశారంటూ ప్రచారం
  • ఇది అసత్య వార్త అని స్పందించిన టీటీడీ అధికారులు
  • టీటీడీపై దుష్ప్రచారం చేసిన మరో 8 మందిపై కూడా కేసులు
టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఇన్ఫోసిన్ నారాయణమూర్తి భార్య సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారనే వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. దీనిపై టీటీడీ స్పందించింది. ఇది ముమ్మాటికీ అసత్య వార్త అని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ఫేస్ బుక్ లో అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. దీంతో పాటు వేంకటేశ్వరస్వామి ఆలయ చరిత్ర, టీటీడీలపై దుష్ప్రచారం చేసిన మరో 8 మందిపై కూడా కేసులు పెట్టామని తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

తమిళ నటుడు శివకుమార్ పై కూడా కేసు నమోదైంది. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, భక్తులు  తిరుమలకు వెళ్లొద్దంటూ సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శివకుమార్ పై కేసు నమోదు చేసినట్టు తిరుమల డీఎస్పీ ప్రభాకర్ బాబు తెలిపారు.
Go Back to Shorts
Sudha Narayanamurthy
TTD
Case

More Telugu News