రాఖీ పండుగకు చెల్లికి సైకిల్ కొనిస్తానని మాటిచ్చిన అన్న.. కొనివ్వలేకపోవడంతో ఆత్మ‌హ‌త్య‌

man commits suicide
  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో ఘటన
  • చెల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆత్మహత్య
  • స‌మ‌యానికి డ‌బ్బులు లేక‌పోవ‌డమే కారణం
రాఖీ పండుగ సందర్భంగా తన సోదరికి గిఫ్టుగా సైకిలు ఇస్తానని మాటిచ్చాడు ఓ సోదరుడు. అయితే, చెల్లితో రాఖీ కట్టించుకున్నాడు కానీ, సైకిల్‌ను మాత్రం కొనివ్వలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. అలా ఆ ఇంట్లో రాఖీ పండుగ రోజున విషాదం నిండుకుంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో కొదాన్‌పూర్వ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పుట్టిలాల్(22) అనే యువకుడు ఆత్మహత్య చేసున్నాడు. చెల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు పుట్టిలాల్ వ‌ద్ద స‌మ‌యానికి డ‌బ్బులు లేక‌పోవ‌డమే ఇందుకు కారణం. పండుగ రోజున చెల్లికి గిఫ్ట్ ఇవ్వ‌లేద‌ని అతడు కుంగిపోయాడు. దీంతో ఇంట్లోంచి వెళ్లి బ‌ర్రాజ్‌పూర్ రైల్వేస్టేష‌న్ వ‌ద్ద గూడ్స్ రైలుకు అడ్డంగా నిలబడి పుట్టిలాల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.
Go Back to Shorts
rakhi
Uttar Pradesh

More Telugu News