ఈ సినిమా రావడానికి ఇదే సరైన సమయం: దర్శకుడు రాజమౌళి

seen aadipurush poster rajamouli
  • ప్రభాస్‌ 'ఆదిపురుష్' గురించి రాజమౌళి అభిప్రాయం
  • పోస్టర్‌ను చాలా రోజుల క్రితమే చూశా
  • అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ 
  • ఇటువంటి సమయంలో రాముడి మీద సినిమా బాగుంటుంది
ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ హీరో ప్రభాస్‌ ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు పలు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే టైటిల్ పోస్టర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది.

'బాహుబలి'తో దేశ వ్యాప్తంగా ప్రభాస్‌ మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోన్న ‘ఆదిపురుష్’ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి దర్శకుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్‌ ఆదిపురుష్ పోస్టర్‌పై స్పందిస్తూ.. ఆ పోస్టర్‌ను తాను చాలా రోజుల క్రితమే చూశానని చెప్పారు.

ఆదిపురుష్ సినిమా రావడానికి ఇదే సరైన సమయమని, ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఇటీవలే రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిందని చెప్పారు. భారత్ మొత్తం ఇప్పుడు రాముడి గురించి చర్చ జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. ఇటువంటి సమయంలో రాముడి మీద సినిమా వస్తే చాలా బాగుంటుందని ఆయన చెప్పారు. ఆదిపురుష్ సినిమాతో హీరో ప్రభాస్ స్థాయి మరింత పెరుగుతుందని తెలిపారు.
Go Back to Shorts
Rajamouli
Prabhas
Tollywood

More Telugu News