ఏపీ కరోనా అప్ డేట్స్: 3,342 పాజిటివ్ కేసులు, 22 మరణాలు

ap corona virus statistics and details
  • అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 551 కేసులు
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 60 మందికి పాజిటివ్
  • తాజాగా 3,572 మందికి కరోనా నయం
ఏపీలో గడచిన 24 గంటల్లో 74,919 నమూనాలు పరీక్షించగా 3,342 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 551 కొత్త కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 60 పాజిటివ్ కేసులు వచ్చాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 22 మంది కరోనాతో మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,566కి పెరిగింది. తాజాగా 3,572 మందికి కరోనా నయం అయింది.

ఓవరాల్ గణాంకాలు చూస్తే, ఏపీలో మొత్తం 8,04,026 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 7,65,991 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 31,469 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 75,02,933 నమూనాలు పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Positive cases
Deaths

More Telugu News