దేశంలో మరో 27,071 మందికి కరోనా పాజిటివ్

India corona update
  • తగ్గుతున్న కరోనా ప్రభావం
  • యాక్టివ్ కేసుల సంఖ్య 3.52 లక్షలు
  • తాజాగా 30,695 మంది డిశ్చార్జి
  • అదే సమయంలో 336 మంది మృతి
  • 1,43,555కి పెరిగిన మరణాల సంఖ్య
దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో 27,071 కొత్త కేసులు వచ్చాయి. దాంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 98,84,100కి చేరింది. 93,88,159 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 3,52,586 మందికి చికిత్స జరుగుతోంది. తాజాగా 30,695 మంది డిశ్చార్జి కాగా, 336 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1,43,355కి పెరిగింది.
Go Back to Shorts
Corona Virus
Positive Cases
Deaths
Active Cases

More Telugu News