చాహల్- ధనశ్రీ జంటకు డిన్నర్ పార్టీ ఇచ్చిన ధోనీ దంపతులు

dhoni gives party to chahal
  • ఇటీవలే ఢిల్లీ శివార్లలో చాహల్ వివాహం 
  • కొత్త జంటను తమ ఇంటికి ఆహ్వానించిన ధోనీ
  • ధోనీ-సాక్షికి చాహల్ కృతజ్ఞతలు
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్‌ ఇటీవలే ఢిల్లీ శివార్లలోని గుర్గావ్ పరిధిలో ఉన్న ఓ రిసార్ట్‌‌లో తన ప్రియురాలు ధనశ్రీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారిద్దరికీ టీమిండియా మాజీ ఆటగాళ్ల నుంచి నేటి ఆటగాళ్ల వరకు పలువురు శుభాకాంక్షలు చెప్పారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మాత్రం ఒట్టి శుభాకాంక్షలతో సరిపెట్టలేదు.

వారికి ధోనీ దంపతులు తాజాగా డిన్నర్ పార్టీ ఇచ్చారు. కొత్త జంటను తమ ఇంటికి ఆహ్వానించి వారికి ధోని కుటుంబం శుభాకాంక్షలు తెలిపింది. వారిద్దరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా డిన్నర్ పార్టీ జరిగింది. అనంతరం ధోనీ-సాక్షికి చాహల్ కృతజ్ఞతలు తెలిపాడు. ధోనీతో దిగిన ఫొటోను‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. వారిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. కృతజ్ఞతల కంటే ఏం చెప్పగలను? అంటూ ధనశ్రీ కూడా ట్వీట్ చేసింది.
Go Back to Shorts
MS Dhoni
Cricket
chahal

More Telugu News