ఏపీ కరోనా అప్ డేట్: 104 మందికి పాజిటివ్

Corona cases update of Andhra Pradesh
  • గత 24 గంటల్లో 29,309 కరోనా పరీక్షలు
  • అత్యధికంగా విశాఖ జిల్లాలో 27 కేసులు
  • ప్రకాశం జిల్లాలో కొత్త కేసులు నిల్
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 1,197
ఏపీలో గడచిన 24 గంటల్లో 29,309 కరోనా టెస్టులు నిర్వహించగా 104 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 27, కృష్ణా జిల్లాలో 25, చిత్తూరు జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విజయనగరం జిల్లాలో 2, శ్రీకాకుళం జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 3 కొత్త కేసులు గుర్తించారు.

అదే సమయంలో 147 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,004 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,79,651 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,197 మందికి చికిత్స జరుగుతోంది. అటు, మొత్తం మరణాల సంఖ్య 7,156కి పెరిగింది.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Update
Positive Cases

More Telugu News