ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు

New Corona Virus positive cases in AP
  • గత 24 గంటల్లో 45,079 కరోనా పరీక్షలు
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 38 కేసులు
  • కోలుకున్న 89 మంది
  • ఇంకా 1,038 మందికి
ఏపీలో గడచిన 24 గంటల్లో 45,079 కరోనా పరీక్షలు నిర్వహించగా 118 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 38 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. కృష్ణా జిల్లాలో 21, విశాఖ జిల్లాలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 89 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,90,884 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,670 మంది కోలుకున్నారు. ఇంకా 1,038 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7,176గా నమోదైంది.
Go Back to Shorts
Corona Virus
Positive Cases
Andhra Pradesh
Active Cases

More Telugu News