254 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

Sensex ends 254 points high
  • 76 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.22 శాతం లాభపడ్డ బజాజ్ ఫైనాన్స్
  • 2 శాతం వరకు నష్టపోయిన ఓఎన్జీసీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తదితర సంస్థలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో మార్కెట్లు నష్టపోయాయి. అయితే మధ్యాహ్నం తర్వాత ఐటీ స్టాకుల్లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో చివరకు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 254 పాయింట్ల లాభంతో 51,280కి ఎగబాకింది. నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 15,175 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (2.22%), సన్ ఫార్మా (2.18%), టెక్ మహీంద్రా (1.89%), బజాజ్ ఆటో (1.88%), యాక్సిస్ బ్యాంక్ (1.82%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-1.97%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.89%), ఐటీసీ (-0.60%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.53%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.47%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News