అనంతపురం జిల్లాలో కాలిబూడిదైన ఎస్బీఐ ఏటీఎంలు

ATM machines caught in fire
  • పామిడిలో ఘటన
  • ఏటీఎం కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు
  • నిమిషాల వ్యవధిలో మొత్తం వ్యాపించిన వైనం
  • పెద్ద శబ్దంతో పేలిన ఎటీఎం యంత్రాలు
అనంతపురం జిల్లా పామిడి ఎస్బీఐ ఏటీఎంలు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. ఇక్కడి ఏటీఎం కేంద్రం వద్ద ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో ఆ మంటలు ఏటీఎం కేంద్రం మొత్తం వ్యాపించాయి. మంటల తీవ్రతకు ఏటీఎం మెషీన్లు పెద్ద శబ్దంతో పేలిపోవడంతో స్థానికులు హడలిపోయారు.

ఈ ఘటనలో ఏటీఎం మెషీన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఏటీఎంలో మంటలు ఎలా వచ్చాయన్నది తెలియరాలేదు.
Go Back to Shorts
ATM
Fire Accident
Pamidi
Anantapur District

More Telugu News