పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన తాప్సీ

Taapsee speaks about her marriage plans
  • నా తల్లిదండ్రులకు నచ్చని వ్యక్తిని చేసుకోను
  • భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే రిలేషన్ షిప్ కు సమయం కేటాయిస్తా
  • అనుకున్నది సాధించిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తా
తెలుగులో పలు చిత్రాలలో నటించిన హీరోయిన్ తాప్సీ... ఆ తర్వాత బాలీవుడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ లో మంచి కాన్సెప్ట్ ఉన్న కథలు దొరకడంతో అక్కడే సెటిలైపోయింది. ఏడాదికి కనీసం ఐదుకి పైగా సినిమాలు చేస్తోందంటే... హిందీ రంగంలో తాప్సీ ఎంత బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

మరోవైపు, విదేశీ బ్యాడ్మింటన్ ఆటగాడు, కోచ్ మథయాస్ బో ప్రేమలో తాప్సీ ఉన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. వీరిద్దరి ప్రేమాయణం గురించి మీడియాలో పుంఖానుపుంఖాలుగా ఆసక్తికర కథనాలు వచ్చాయి. తాజాగా తన పెళ్లి గురించి తాప్సీ కొంత క్లారిటీ ఇచ్చింది.

తన తల్లిదండ్రులకు నచ్చని వ్యక్తిని తాను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేసింది. తాను డేటింగ్ చేసిన ప్రతి వ్యక్తితో ఇదే విషయాన్ని క్లియర్ గా చెప్పానని తెలిపింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే తాను రిలేషన్ షిప్ కోసం సమయాన్ని కేటాయిస్తానని... అనవసరంగా టైమ్ పాస్ చేయనని తెలిపింది. తాను పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతాననే భయం తన తల్లిదండ్రుల్లో ఉందని చెప్పింది.

కెరీర్ పరంగా తాను సాధించాల్సింది ఇంకా ఉందని తాప్సీ తెలిపింది. అనుకున్నది సాధించిన తర్వాత... వర్క్ పరంగా కొంత నెమ్మదిస్తానని, సంవత్సరానికి ఐదారు సినిమాలు కాకుండా, రెండు, మూడు సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పింది. అప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించే సమయం తనకు దొరుకుతుందని తెలిపింది.
Go Back to Shorts
Taapsee
Marriage
Tollywood
Bollywood

More Telugu News