సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Mrunal Thakur opposite Dulkhar
  • దుల్ఖర్ సరసన బాలీవుడ్ భామ 
  • చిరంజీవి, బాబీ సినిమా అప్ డేట్
  • మరోసారి విలన్ గా విజయ్ సేతుపతి
*  దుల్ఖర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేశారు. ఇందులో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్ఖర్ నటిస్తుండగా.. సీత పాత్రలో మృణాల్ నటిస్తుంది.
*  ప్రస్తుతం 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి దీని తర్వాత 'లూసిఫర్' రీమేక్ చేయనున్నారు. ఇక ఆ చిత్రానికి సమాంతరంగా బాబీ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కూడా ఆయన నటిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం షూటింగును విజయదశమికి ప్రారంభించడానికి నిర్ణయించినట్టు తాజా సమాచారం.
*  ఇటీవల విడుదలైన 'ఉప్పెన' చిత్రంలో కీలక పాత్ర పోషించిన తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించాడు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రూపొందే చిత్రంలో ప్రధాన విలన్ పాత్రకు విజయ్ సేతుపతిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Mrunal Thakur
Dulkhar
Chiranjeevi
Bobby
Vijay Setupati

More Telugu News