ఏపీ రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!

AP Corona media report
  • గత 24 గంటల్లో 80,376 కరోనా పరీక్షలు
  • 1,908 మందికి పాజిటివ్
  • తూర్పు గోదావరిలో 438 కేసులు
  • కర్నూలు జిల్లాలో 26 కేసులు
  • రాష్ట్రవ్యాప్తంగా 23 మరణాలు
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 80,376 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,908 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 438 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 231, గుంటూరు జిల్లాలో 216, నెల్లూరు జిల్లాలో 213 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 26 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 2,103 మంది కరోనా నుంచి కోలుకోగా, 23 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,80,258 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,46,370 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 20,375గా నమోదైంది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 13,513కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
New Cases
Deaths

More Telugu News