ఏపీలో మరో 1,435 మందికి కరోనా పాజిటివ్

AP Corona Cases bulletin
  • గత 24 గంటల్లో 69,173 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 199 కేసులు
  • కర్నూలు జిల్లాలో 19 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో 6 కరోనా మరణాలు
  • ఇంకా 15,472 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 69,173 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,435 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 199 కొత్త కేసులు నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో 190, తూర్పు గోదావరి జిల్లాలో 178, కృష్ణా జిల్లాలో 175 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 19 కేసులను గుర్తించారు.

అదే సమయంలో 1,695 మంది కోలుకోగా, రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు కరోనాతో మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,702కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,00,038 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,70,864 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,472 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
New Cases
Deaths

More Telugu News