ఏపీలో మరో 1,601 మందికి కరోనా పాజిటివ్

AP Corona Media Report
  • గత 24 గంటల్లో 71,532 కరోనా పరీక్షలు
  • తూర్పుగోదావరిలో 273 కేసులు
  • కర్నూలు జిల్లాలో 10 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో 16 కరోనా మరణాలు
  • ఇంకా 14,061 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 71,532 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,601 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 273 కొత్త కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరిలో 221, చిత్తూరు జిల్లాలో 217, నెల్లూరు జిల్లాలో 208 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 10 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 1,201 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మంది మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో కరోనా మృతుల సంఖ్య 13,766కి పెరిగింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,06,191 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,78,364 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,061 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
New Cases
Deaths

More Telugu News