ఏపీలో మరో 1,186 మందికి కరోనా పాజిటివ్

AP corona cases and deaths details
  • గత 24 గంటల్లో 56,155 కరోనా పరీక్షలు
  • తూర్పుగోదావరి జిల్లాలో 175 కేసులు
  • రాష్ట్రంలో 10 కరోనా మరణాలు
  • ఇంకా 14,473 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 56,155 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,186 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 175 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 171, నెల్లూరు జిల్లాలో 156, ప్రకాశం జిల్లాలో 125, గుంటూరు జిల్లాలో 111, కృష్ణా జిల్లాలో 103 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు, విజయనగరం జిల్లాలలో 13 కేసుల చొప్పున వెల్లడయ్యాయి.

అదే సమయంలో 1,396 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే నలుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,867కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,15,302 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,86,962 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,473 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
New Cases
Deaths

More Telugu News