ఏపీలో మరో 1,502 మందికి కరోనా పాజిటివ్

AP Daily corona cases update
  • గత 24 గంటల్లో 63,717 కరోనా టెస్టులు
  • నెల్లూరు జిల్లాలో 260 మందికి పాజిటివ్
  • విజయనగరం జిల్లాలో 17 కేసులు
  • రాష్ట్రంలో 16 మంది మృతి
  • 14,883 మందికి కొనసాగుతున్న చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 63,717 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,502 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 260 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 208, తూర్పు గోదావరి జిల్లాలో 191, ప్రకాశం జిల్లాలో 152, పశ్చిమ గోదావరి జిల్లాలో 146 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 17 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

అదే సమయంలో 1,525 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటిదాకా 13,903 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో నేటి వరకు 20,19,702 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,90,916 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,883 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
New Cases
Deaths
Update

More Telugu News