మధ్యప్రదేశ్‌లో ఆరుగురికి ఏవై.4 వేరియంట్

6 persons infected to  AY4 Variant of Coronavirus in Madhya Pradesh
  • బాధితులందరూ వ్యాక్సినేషన్ పూర్తయినవారే
  • వేరియంట్ జన్యుక్రమాన్ని విశ్లేషించేందుకు నమూనాలు ల్యాబ్‌కు
  • చికిత్స అనంతరం కోలుకున్న బాధితులు
ఏవై.4గా పిలుస్తున్న కరోనా వైరస్‌లోని కొత్త వేరియంట్ మధ్యప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. ఇండోర్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు ఈ వేరియంట్ బారినపడ్డారు. వీరంతా వ్యాక్సినేషన్ పూర్తయిన వారే కావడం గమనార్హం. వీరందరికీ ఏవై.4 వేరియంట్ సోకిన విషయాన్ని దేశ రాజధానిలోని జాతీయ వ్యాధి నివారణ కేంద్రం నిర్ధారించింది.

ఈ వేరియంట్ జన్యు క్రమాన్ని పరిశీలించేందుకు బాధితుల నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. చికిత్స అనంతరం బాధితులు కోలుకున్నట్టు మధ్యప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ ప్రధానాధికారి బీఎస్ సాయిత్య తెలిపారు.
Go Back to Shorts
Madhya Pradesh
Indor
AY.4 Variant
Corona Virus

More Telugu News