అమెజాన్ ప్రైమ్ లోనూ ఇక క్రికెట్ మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారాలు

Amazon Prime live casts New Zealand and Bangladesh test series
  • న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్
  • అమెజాన్ ప్రైమ్ లో లైవ్ కాస్ట్ 
  • న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం
ఇప్పటివరకు సినిమాలు, వెబ్ సిరీస్ లు, తదితర డిజిటల్ కంటెంట్ కే పరిమితమైన అమెజాన్ ప్రైమ్ క్రికెట్ మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారాలు కూడా చేస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికపైనా లైవ్ లో చూడొచ్చు.

శనివారం తొలిరోజు ఆటను అమెజాన్ ప్రైమ్ లైవ్ కాస్ట్ చేసింది. ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం కోసం అమెజాన్ ప్రైమ్... ఆతిథ్య న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం మొత్తం ఎంతన్నది వెల్లడికాలేదు.
Go Back to Shorts
Amazon Prime
Cricket
Live Cast
New Zealand
Bangladesh
Test Series

More Telugu News