హైద‌రాబాద్‌లో రోడ్డు ప్ర‌మాదం.. సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌ను 20 మీట‌ర్లు ఈడ్చుకెళ్లిన టిప్ప‌ర్

road accident in hyderabad
  • కూకట్‌పల్లిలో ప్రమాదం
  • సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ మృతి
  • ఈ రోజు ఉద‌యం 5 గంటలకు ఘ‌ట‌న‌
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ ప్రాణాలు కోల్పోయాడు. కేపీహెచ్‌బీ కాలనీలో బైక్‌పై వెళ్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జగన్ మోహన్‌ రెడ్డిని ఢీ కొట్టిన ఓ టిప్పర్‌ ఆగకుండా ముందుకు వెళ్తూ అత‌డిని 20 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్ర‌మాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమ‌త్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఈ రోజు ఉద‌యం 5 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు ప్రారంభించిన‌ట్లు తెలిపారు. మ‌రోవైపు, ఎల్బీ నగర్‌ అండర్‌ పాస్‌లోనూ గ‌త‌ అర్ధరాత్రి దాటిన అనంత‌రం మ‌రో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. సాగర్‌ రింగ్‌రోడ్డు వైపునుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అండర్‌ పాస్‌లో బోల్తా కొట్టింది. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ అందులోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కారును అక్క‌డే వ‌దిలేసి వెళ్లిపోయాడు. పోలీసులు కారును అక్కడి నుంచి తరలించారు.
Go Back to Shorts
Road Accident
Hyderabad

More Telugu News