కేంద్ర బడ్జెట్ ఊపు.. ఈరోజు కూడా భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

Markets ends in profits
  • 696 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 203 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 
  • ఐదున్నర శాతం లాభపడ్డ ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు విలువ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో స్టాక్ మార్కెట్లకు ఊపు వచ్చింది. నిన్న భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు ఈరోజు కూడా అదే ధోరణిని కనబరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 696 పాయింట్లు లాభపడి 59,558కి చేరుకుంది. నిఫ్టీ 203 పాయింట్లు పెరిగి 17,780 వద్ద స్థిరపడింది. ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.57%), బజాజ్ ఫిన్ సర్వ్ (5.13%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.40%), బజాజ్ ఫైనాన్స్ (3.17%), కోటక్ బ్యాంక్ (3.01%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.61%), నెస్లే ఇండియా (-1.03%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.97%), మారుతి సుజుకి (-0.48%), ఎల్ అండ్ టీ (-0.47%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News