'భీమ్లా నాయక్' ఫారెస్ట్ ఫైర్ .. ఆపడం కష్టం: తమన్

Bheemla Nayak movie update
  • 'భీమ్లా నాయక్' ఒక తుపాన్
  • ఆడియన్స్ నుంచి అదే మాట వచ్చింది 
  • త్రివిక్రమ్ సపోర్ట్ మరిచిపోలేనిది
  • ఆయనకి థ్యాంక్స్ అని చెప్పిన తమన్
పవన్ కల్యాణ్ తాజా చిత్రమైన 'భీమ్లా నాయక్' భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ ప్రెస్ మీట్ లో తమన్ మాట్లాడుతూ .. " ఈ సినిమా తుపాన్ లా దూసుకుపోతుందని నాకు ముందుగానే తెలుసు. కాకపోతే ఆ మాట ఆడియన్స్ వైపు నుంచి రావాలి. 

ఈ సినిమా సక్సెస్ లో నేనొక పిల్లర్ అని అంటున్నారు. ఆ పిల్లర్లో సిమెంట్ మాత్రం త్రివిక్రమ్ గారే. ఆయన ఎంతో స్వేచ్ఛను ఇచ్చారు .. సపోర్టు చేశారు. నన్ను ఎప్పటికప్పుడు ముందుకు తోస్తూనే ఉన్నారు. అందుకు ఆయనకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. పవన్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో పనిచేయడం ఒక మరిచిపోలేని అనుభవం. 

ఈ సినిమా ఒక ఫారెస్ట్ ఫైర్ లాంటిది .. ఇక దీనిని ఆపడం కష్టం. ఈ సినిమా గురించి ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. కానీ ప్రస్తుతం అంత సమయం లేదు. మరో వేదికపై మాట్లాడతాను. ఈ సినిమా కథకి తగిన పాటలను అందించిన రామజోగయ్య శాస్త్రి గారికీ .. కాసర్ల శ్యామ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను" అంటూ ముగించాడు.
Go Back to Shorts
Pavan kalyan
Rana Daggubati
Thaman
Bheemla Nayak Movie

More Telugu News