నేడు ఢిల్లీకి వెళుతున్న సీఎం కేసీఆర్

kcr to visit delhi
  • ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో సాయంత్రం భేటీ?
  • ఇప్ప‌టికే ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న ప‌లుసార్లు వాయిదా
  • కాసేప‌ట్లో మంత్రులు, అధికారుల‌తోనూ కేసీఆర్ స‌మావేశం
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్న‌ట్లు తెలిసింది. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కేసీఆర్ భేటీకానున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న ప‌లుసార్లు వాయిదా ప‌డింది. కేంద్రంలోని ఎన్డీఏకు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను కూడ‌గ‌ట్టాల‌ని కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారు. 

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఆయ‌న ముంబైలో మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రేతో కూడా చ‌ర్చ‌లు జ‌రిపారు. మరోపక్క, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. మంత్రులు, అధికారుల‌తో చ‌ర్చించి బడ్జెట్ సమావేశాల నిర్వహణా తేదీలను ఖరారు చేస్తారు. అనంత‌రం ఆయ‌న ఢిల్లీ వెళ్ల‌నున్న‌ట్లు తెలిసింది.
Go Back to Shorts
KCR
New Delhi
Telangana

More Telugu News