విషాదంగా మారిన వివాహానంతర ఫొటో షూట్!

Post wedding photo shoot ended in a tragic way
  • ఇటీవల బాగా పెరిగిన వెడ్డింగ్ ఫొటోషూట్ లు
  • మార్చి 14న పెళ్లి చేసుకున్న రెజిల్, కార్తీక
  • కట్టియాడి నదిలో ఫొటోషూట్
  • ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయిన జంట
  • వరుడు మృతి, వధువు పరిస్థితి విషమం
ఇటీవల కాలంలో ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ లు, వివాహానంతర ఫొటోషూట్ ల ట్రెండ్ నడుస్తోంది. జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం పెళ్లి. పెళ్లిని మరింత మధురం చేసుకునే క్రమంలో భాగంగా యువతీయువకులు ఈ ఫొటోషూట్ ల బాటపట్టారు. అయితే, కేరళలో ఓ వివాహానంతర ఫొటోషూట్ విషాదంగా మారింది. నదిలో ఫొటోషూట్ చేస్తుండగా, వధూవరులు ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యారు. 

కోజికోడ్ ప్రాంతంలోని కడియంగడ్ కు చెందిన రెజిల్, కార్తీక మార్చి 14న పెళ్లి చేసుకున్నారు. అయితే, ఫొటో షూట్ కోసం తాజాగా కట్టియాడి నది వద్దకు వచ్చారు. అయితే వీరు ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయారు. స్థానికులు వెంటనే స్పందించి ఇద్దరినీ ఒడ్డుకు చేర్చారు. అయితే కొన ఊపిరితో ఉన్న రెజిల్, కార్తీకను ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు రెజిల్ మరణించగా, కార్తీక పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో కడియంగడ్ లో విషాదం నెలకొంది.
Go Back to Shorts
Post Wedding Photo Shoot
Regil
Karthika
Kozhikode
Kerala

More Telugu News