దూసుకుపోయిన మార్కెట్లు.. వెయ్యి పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్!

Markets ends in profits
  • 1,041 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 309 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 5 శాతం వరకు పెరిగిన టైటాన్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే భారీ లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. అంతర్జాతీయ సానుకూలతలు, చైనాలో ఆంక్షల ఎత్తివేత, డాలర్ బలహీనత తదితర అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,041 పాయింట్లు పెరిగి 55,925కి చేరుకుంది. నిఫ్టీ 309 పాయింట్లు లాభపడి 16,661కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (4.94%), మహీంద్రా అండ్ మహీంద్రా (4.69%), ఇన్ఫోసిస్ (4.57%), ఎల్ అండ్ టీ (3.77%), టెక్ మహీంద్రా (3.59%). 

టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.23%), సన్ ఫార్మా (-1.75%), డాక్టర్ రెడ్డీస్ (-0.73%), ఐటీసీ (-0.04%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News