నేను కేసినోలకు వెళ్తా.. పేకాట ఆడతా: ఏపీ మాజీ మంత్రి బాలినేని

I go to Casinos says Balineni Srinivas Reddy
  • చికోటి ప్రవీణ్ తో సంబంధాలు లేవన్న బాలినేని 
  • తనపై నిరాధారమైన ఆరోపణలు వద్దని వ్యాఖ్య   
  • ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని వెల్లడి 
కేసినోల నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. చికోటితో సంబంధాలు ఉన్నట్టు కొందరు రాజకీయ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావుకు ఆయనతో సంబంధం ఉందనే ఆరోపణలు వచ్చాయి. 

ఈ ఆరోపణలపై బాలినేని స్పందిస్తూ... చికోటితో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. తాను కేసినోలకు వెళ్తానని, పేకాట ఆడతానని... ఈ విషయాన్ని తానే ఒప్పుకుంటానని... కానీ, చికోటితో తనకు సంబంధం లేదని అన్నారు. తాను నిజాలను ఒప్పుకుంటానని... తనకు డ్రామాలు చేయడం రాదని చెప్పారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఏ విధమైన విచారణకైనా తాను సిద్ధమేనని చెప్పారు.
Go Back to Shorts
Balineni Srinivasa Reddy
YSRCP
Chikoti Praveen
Casino

More Telugu News