నందమూరి కుటుంబం నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు

Balakrishna comments on his son mokshagna debut
  • కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్రంపై స్పందించిన బాలకృష్ణ
  • వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తాడని వెల్లడి
  • తన అఖండ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించిన సీనియర్ హీరో
సినిమా పరిశ్రమలో హీరోలు, దర్శకులు, నిర్మాతల వారసులు తెరంగేట్రం చేస్తున్నారంటే వారి అభిమానుల్లో ఎంతో ఉత్సాహం ఉంటుంది. టాలీవుడ్ లో చాన్నాళ్ల నుంచి వారసుల హవా నడుస్తూనే ఉంది. మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుంచి పలువురు వారసులు వచ్చి పరిశ్రమలలో నిలదొక్కుకున్నారు. తాజాగా మరో నట వారసుడు ముందుకు రాబోతున్నాడు. అతను మరెవరోకాదు నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ. చాన్నాళ్ల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీపై చర్చ నడుస్తోంది. ఇదిగో ఈ సినిమాతో వస్తున్నాడు.. ఆ దర్శకుడు పరిచయం చేస్తున్నాడు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. కానీ, దేనిపైనా అధికారిక ప్రకటన రాలేదు. 

ఈ నేపథ్యంలో స్వయంగా బాలకృష్ణ తన వారసుడి తెరంగేట్రం గురించి తాజాగా మాట్లాడారు. మోక్షజ్ఞను వచ్చే ఏడాది పరిచయం చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే, అతని చిత్రానికి దర్శకుడు ఎవరన్న దానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. తనకు పలు హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా ఉంటుందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. అంతా దైవేచ్ఛ అని నవ్వారు. మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చి భారీ విజయం సొంతం చేసుకున్న అఖండ సినిమాకు సీక్వెల్ ఉందని బాలయ్య వెల్లడించారు. అఖండ2 కోసం సబ్జెక్ట్ కూడా సిద్ధం అయిందని, ప్రకటనే తరువాయి అని తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
Go Back to Shorts
Tollywood
Balakrishna
mokshagna
debut
Boyapati Sreenu
akhanda2

More Telugu News