నాగ చైతన్య ‘కస్టడీ’ విడుదల తేదీ ఖరారు

Naga Chaitanya and Venkat Prabhus Custody to release on May 12 2023
  • వచ్చే ఏడాది మే 12న విడుదల
  • ప్రకటించిన చిత్ర నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
  • కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్న నాగచైతన్య
నాగ చైతన్య జోరు పెంచాడు. 2022లో బంగార్రాజు, థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దాతో పలకరించిన చైతూ.. 2023లో కస్టడీ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ అయిన శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ప్రకటించింది. మే 12న సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపింది.

యాక్షన్ కథాంశంగా 'కస్టడీ' తెరకెక్కుతోంది. నాగచైతన్య గత చిత్రాలకు భిన్నంగా ఇది ఉంటుంది. వెంకట్ ప్రభు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. కానిస్టేబుల్ పాత్రతో నాగ్ తన నటనలో కొత్త కోణాన్ని చూపించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను గత నెలలోనే నాగచైతన్య 36వ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాణ సంస్థ విడుదల చేయడం తెలిసిందే. కృతిశెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
Go Back to Shorts
Naga Chaitanya
Venkat Prabhu
release
date
custody

More Telugu News