'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన వినాయక్!

Krishnagadu Frist Look Poster Released
  • రిష్వి హీరోగా 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్'
  • కథానాయికగా పరిచయమవుతున్న విస్మయశ్రీ 
  • ప్రేమకథ నేపథ్యంలో సాగే సినిమా 
  • యూత్ ను ఆకట్టుకోవడం ఖాయమంటున్న టీమ్
ప్రేమకథా చిత్రాలు ఎప్పుడూ సక్సెస్ ఫుల్‌ ఫార్ములానే. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఇక కొత్తవాళ్లతో ప్రయోగాలు చేసే సమయంలో అందరూ ప్రేమకథలనే ఎంచుకుంటారు. ఇప్పుడు అలాంటి ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతోనే కొత్త హీరో హీరోయిన్ ను పరిచయం చేస్తూ, 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' అనే సినిమాను రూపొందిస్తున్నారు. 

శ్రీ తేజస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ సినిమాతో, రాజేష్ దొండపాటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. రిష్వి తిమ్మరాజు - విస్మయశ్రీ హీరో హీరోయిన్ గా నటిస్తున్న 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ ప్రారంభించింది. ఈ క్రమంలో సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను వీవీ వినాయక్ రిలీజ్ చేశారు. 

ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి కావాల్సిన సంగీతాన్ని సాబు వర్గీస్ అందించారు. పాటలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేట్టు కనిపిస్తున్నాయి. ఎస్ కే రఫీ కెమెరా పనితనం ఈ సినిమాకు కలిసి వచ్చేలా ఉంది.
Go Back to Shorts
Rishvi Thimmaraju
Vismaya Sri
Krishnagaadu Ante Oka Renj Movie

More Telugu News