మురికికూపంలా మారిపోయిన ఎవరెస్ట్.. వీడియో ఇదిగో

Everest became as dumpyard
  • వ్యర్థాలను పడేస్తున్న పర్వతారోహకులు
  • వీడియో షేర్ చేసి ఐఏఎస్ అధికారిణి
  • గుండె తరుక్కుపోతోందని వ్యాఖ్య
ఎవరెస్ట్ శిఖరం అంటేనే ఒక అందమైన దృశ్యం అందరి కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. తెల్లటి మంచుతో కూడిన సుందర దృశ్యం మదిలో మెదులుతుంది. అయితే, వాస్తవానికి అక్కడి పరిస్థితి భిన్నంగా ఉంది. పర్వతారోహకులు ఎవరెస్ట్ క్యాంప్ సైట్ ను మురికికూపంగా మార్చేస్తున్నారు. వ్యర్థాలను అక్కడే పడేసి వస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను పడేస్తూ ఎవరెస్ట్ ను మురికికూపంగా మార్చారని ఆమె అన్నారు. ఎవరెస్ట్ ను కూడా మన జనాలు వదల్లేదని చెప్పారు. వీడియో చూస్తే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని నిరోధించేందుకు కఠిన చట్టాలను తీసుకురావాలని కొందరు అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Everest
Garbage

More Telugu News