ఆ పదాన్ని చేర్చాలని ఆక్స్‌ఫర్డ్‌కు పెద్ద ఎత్తున మెయిల్స్!: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్

VijayaSaiReddy satire on Chandrababu Naidu
  • కోటి రూపాయలంటే టన్ను స్టీల్ అనే పదాన్ని చేర్చాలంటూ విజయసాయి ఎద్దేవా
  • కొత్త టెక్నాలజీతో పాటు కొత్త పదాలను కూడా చంద్రబాబు సృష్టిస్తారని చురకలు
  • చంద్రబాబుకు ఐటీ నోటీసులపై పచ్చ మీడియా వాస్తవాలు గ్రహించాలని సూచన
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సామాజిక అనుసంధాన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శల వర్షం కురిపిస్తోన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి స్పందించారు. బుధవారం ట్విట్టర్ వేదికగా ఎప్పటిలాగే వరుస ట్వీట్‌లతో చంద్రబాబుకు చురకలు అంటించారు. 

వాడుకలో ఉన్న కొత్త పదాలను గుర్తించి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ.. ప్రతి సంవత్సరం నిఘంటువులో చేరుస్తుందని, కోటి రూపాయలంటే ఒక టన్ను స్టీల్ అనే పదజాలాన్ని కూడా చేర్చాలని ఉత్సాహవంతులైన యువతీ, యువకులు ఆక్స్‌ఫర్డ్‌కు మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారని, ఆ క్రెడిట్ కూడా చంద్రబాబుకే దక్కుతుందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. కొత్త టెక్నాలజీనే కాదు పదాలను కూడా ఆయన సృష్టిస్తారన్నారు.

మేం కూయకపోతే తెల్లవారదని భ్రమపడే చంద్రబాబు పచ్చ మీడియా కోళ్లు ఇకనైనా వాస్తవాలను గ్రహించాలని టీడీపీ అనుకూల మీడియాపై విమర్శలు గుప్పించారు. తమ యజమాని అక్రమ కమీషన్ల సొమ్ము రూ.118 కోట్లకు సంబంధించిన వార్తలను వారు రాయకుండా ఆపేశారని, కానీ శివుడి మూడో నేత్రం వంటి సోషల్ మీడియా దేశమంతా చాటింపు చేసిందన్నారు. చంద్రబాబు అనుకూల మీడియా ఆపితే ఆగే రోజులు ఇప్పుడు లేవని, ఇప్పటికైనా ఈ విషయం గ్రహించాలని సూచించారు.
Go Back to Shorts
Vijayasai Reddy
Chandrababu
Telugudesam

More Telugu News