మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ బహిష్కృత నేత యెన్నం

Yennam Srinivas Reddy and others joins in Congress
  • తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వాతావరణం
  • యెన్నం, మస్కతి డెయిర్ చైర్మన్ అలీ మస్కతి సహా పలువురికి కాంగ్రెస్ తీర్థం
  • కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే
తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఊపందుకున్న వేళ చేరికలు కూడా జోరుగా సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పార్టీ తీర్థం పుచ్చుకోగా తాజాగా, బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సహా పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో యెన్నంతోపాటు మస్కతి డెయిరీ చైర్మన్ అలీ మస్కతి, ఖమ్మం కార్పొరేటర్ దొడ్డా నగేశ్, మహబూబ్‌నగర్‌కు చెందిన కౌన్సిలర్ బురుజు సుధాకర్‌రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గనేత ఉపేందర్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హోటల్ తాజ్ కృష్ణాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఖర్గే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Go Back to Shorts
Congress
Yennam Srinivas Reddy
Mallikarjun Kharge

More Telugu News