చంద్రబాబు గారు బీజేపీలోకి పంపించిన కోవర్టులంతా ఆ పార్టీని గాలికొదిలి టీడీపీ భజన చేస్తున్నారు: విజయసాయిరెడ్డి

Chandrababu coverts in BJP are praising TDP says Vijayasai Reddy
  • పురందేశ్వరి సలహా మేరకు టీడీపీ నేతలను పరామర్శించారన్న విజయసాయి
  • వీరు ఒలకబోసిన సానుభూతి ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లిందని వ్యాఖ్య
  • 'బావ'సారూప్యం అంటే ఇదేనేమో అని ఎద్దేవా
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, కొందరు బీజేపీ నేతలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు బీజేపీలోకి పంపిన కోవర్టులంతా ఆ పార్టీని గాలికొదిలేసి టీడీపీ భజన చేస్తున్నారని విమర్శించారు. క్రిమినల్ కేసుల్లో అరెస్టయి కడప జైల్లో ఉన్న టీడీపీ జిల్లా నాయకులను పురందేశ్వరి సలహా మేరకు రాష్ట్ర బీజేపీ నేతలు పరామర్శించి, సానుభూతిని ఒలకబోయడం ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లిందని అన్నారు. 'బావ'సారూప్యం అంటే ఇదేనేమో అని ఎద్దేవా చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు. 

Go Back to Shorts
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam
Daggubati Purandeswari
BJP

More Telugu News