ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య

Rajaiah meets cm revanth reddy
  • బీఆర్ఎస్ నుంచి ఈ రోజు పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరిక
  • ఇలాంటి సమయంలో రాజయ్య భేటీ కావడంతో ప్రాధాన్యత
  • సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు నేతలు
మాజీ ఉపముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత రాజయ్య శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తుండడం తెలిసిందే. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డితో రాజయ్య భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ రోజు పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Go Back to Shorts
rajaiah
Revanth Reddy
Congress

More Telugu News