ఎన్టీఆర్ కు ఇష్టమైన బిర్యానీ ఇదేనట!

know the details about jr ntr favourite biryani
  • చెన్నైలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ తనకు ఇష్టమైన బిర్యానీ గురించి చెప్పిన ఎన్టీఆర్
  • దేవర మూవీ ప్రమోషన్‌లో భాగంగా వివిధ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎన్టీఆర్ 
  • తలప్పకట్టి బిర్యానీ ఒకటి పార్సిల్ తీసుకువెళదామని అనుకున్నానని చెప్పిన ఎన్టీఆర్ 
హీరో ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడు అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే .. బావర్చీ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒక్కడినే తినేస్తానంటూ ఎన్టీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడు అని అందరూ అనుకుంటుంటారు. తాజాగా ఇప్పుడు దేవర ప్రమోషన్స్ లో ఉన్న ఎన్టీఆర్ .. తమిళనాడు ఫేమస్ బిర్యానీ గురించి మాట్లాడాడు. దేవర మూవీ సెప్టెంబర్ 27న విడుదల కానుంది.  

ఈ క్రమంలో ఇటీవల మూవీ ట్రైలర్ లాంచ్ కోసం ముంబై వెళ్లి వచ్చిన ఎన్టీఆర్ ... మంగళవారం సాయంత్రం చెన్నైలో దిగాడు.. మీడియాతో చిట్ చాట్ లో అనేక విషయాలు మాట్లాడాడు. యాంకర్ వరుస ప్రశ్నలు వేస్తుండగా.. మీరు నా ప్లాన్ నాశనం చేస్తున్నారు, నేను వెళ్లేటప్పుడు దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ ఒకటి పార్సిల్ తీసుకువెళదామని అనుకున్నాను. కానీ .. మీ వల్ల అది మిస్ అవుతుందేమో..దేవర రిలీజ్ అయిన తర్వాత ఇద్దరం వెళ్లి తిందాం అని ఎన్టీఆర్ యాంకర్ తో చెప్పాడు. దీంతో ఆ బిర్యానీ అంటే ఎన్టీఆర్‌కు బాగా ఇష్టం అనేది అర్ధం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దమ్ బిర్యానీ ఎలానో .. తమిళనాడు చెన్నైలో తలప్పకట్టి బిర్యానీ అంటే అంత ఫేమస్.
Go Back to Shorts
Jr NTR
Biryani
Devara movie
entertainment news

More Telugu News