చంద్రబాబులాంటి వెన్నుపోటుదారులు దేవుడిని, మతాన్ని వాడుకుంటారు: విజయసాయి రెడ్డి

Vijayasai Reddy fires on Chandrababu
  • చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించిన విజయసాయి
  • హిందూమతాన్ని నమ్మడం, వాడుకోవడం రెండూ వేరువేరని వ్యాఖ్య
  • నిజమైన హిందువు దేవుడిని, మతాన్ని నమ్ముతాడన్న విజయసాయి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. హిందూమతాన్ని నమ్మడం, వాడుకోవడం ఈ రెండూ వేరువేరని ఆయన పేర్కొన్నారు. నిజమైన హిందువు దేవుడిని, హిందూ మతాన్ని నమ్మకుంటాడని... రాజకీయ అజ్ఞాని, చంద్రబాబులాంటి వెన్నుపోటుదారులు రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్లు దేవుడుని, మతాన్ని వాడుకుంటారని విమర్శించారు. 

వైసీపీ పాలనలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని, లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఏపీ ప్రభుత్వం, హిందూ సంఘాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశం దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. సుప్రీంకోర్టులో కూడా ఈ అంశంపై విచారణ జరిగింది. లడ్డూ నాణ్యతపై సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా మీడియాతో సీఎం మాట్లాడారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై విజయసాయి విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
Vijayasai Reddy
YSRCP
chandrababu
Telugudesam

More Telugu News