త్వరలో పీఎం కిసాన్ 19వ విడత నిధుల విడుదల

PM Kisan 19th Instalment Release Date
  • ఫిబ్రవరి 24న విడుదల కానున్న పీఎం కిసాన్ నిధులు
  • రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున నిధుల జమ
  • 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద అందించే పీఎం కిసాన్ పథకం 19వ విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. ఫిబ్రవరి 24న రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. బీహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిధులను విడుదల చేయనున్నారు.

19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. ఈ-కేవైసీ చేసి ఉండాలి.

పీఎం కిసాన్ పథకానికి సంబంధించి స్టేటస్ తెలుసుకోవడానికి లేదా పీఎం కిసాన్ జాబితాలో పేరు ఉందో లేదో చూడడానికి పీఎం కిసాన్ ప్రభుత్వ వెబ్ సైట్‌లోకి వెళ్లి తనిఖీ చేసుకోవాలి. రిజిస్టర్డ్ మొబైల్ లేదా ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసి వివరాలు పొందవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంటుంది.
Go Back to Shorts
PM Kisan
BJP
Farmer

More Telugu News