తెలుగు ప్రజలకు చంద్రబాబునాయుడు 'ఉగాది శుభాకాంక్షలు'

Chandrababu Naidu Ugadi Wishes to Telugu People
  • 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసిన చంద్రబాబునాయుడు
  • అందరి జీవితాల్లో వెలుగులు నిండాలన్న చంద్రబాబు
  • తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించిన సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రేపు ఉగాది పర్వదినం నేపథ్యంలో రాజకీయ, సినీ ప్రముఖులు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అలాగే తాము తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.

"షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ ఆశలు, ఆకాంక్షలు తీరి, జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు.

నూతన సంవత్సరంలో పేదరికం లేని సమ సమాజ నిర్మాణం కోసం మనం తలపెట్టిన పీ4 తో పాటు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ అందిపుచ్చుకుని పురోగమించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 'స్వర్ణాంధ్ర విజన్ 2047' విజయవంతంగా ముందుకు సాగాలని అన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Ugadi
Telugu New Year
Andhra Pradesh
AP CM
Ugadi Wishes
Sri Parabhava Nama Samvatsara

More Telugu News