అమెరికా అనుమతితో చమురు ఎగుమతులు..! స్పందించిన రష్యా

Russia Responds to US Permission on Oil Exports
  • చమురు సరఫరా కోసం ఇతర దేశాల అనుమతి అవసరం లేదన్న రష్యా
  • ఏ దేశానికి ఎంత సరఫరా చేయాలనేది మా దేశానికి సంబంధించినది అన్న రష్యా
  • ఇతర దేశాలు చేసే ప్రకటనలు ఆశ్చర్యానికి గురి చేశాయన్న రష్యా
చమురు సరఫరా కోసం తమకు ఇతర దేశాల అనుమతి అవసరం లేదని రష్యా స్పష్టం చేసింది. అమెరికా ఆదేశాలతో ప్రపంచ దేశాలకు రష్యా చమురు విక్రయిస్తోందని వార్తలు వచ్చాయి. దీనిని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఏ దేశానికి ఎంత చమురు సరఫరా చేయాలనేది తమ దేశానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తమ జాతీయ సార్వభౌమాధికారానికి సంబంధించినదని తెలిపింది.

చమురు ఉత్పత్తి, ఎగుమతులకు సంబంధించిన నిర్ణయాలు పూర్తిగా దేశం చేతిలోనే ఉంటాయని పేర్కొంది. చమురు సరఫరా చేయడానికి ముందు రష్యా తమ అనుమతి పొందాలని ఇతర దేశాలు చేసే ప్రకటనలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి డిమిత్రి బిరిచెవ్‌స్కీ తెలిపారు. ఇరాన్ యుద్ధం వేళ, రష్యా చమురు దిగుమతికి భారత్‌కు అమెరికా మినహాయింపు ఇచ్చిందనే వార్తల నేపథ్యంలో రష్యా నుంచి తాజా ప్రకటన రావడం గమనార్హం.
Go Back to Shorts
Russia
Russia oil exports
Oil exports
Dimitry Birichevsky
America
Crude oil
India oil imports

More Telugu News