అన్యం గోవిందు మరణం జనసేనకు తీరని లోటు: పవన్ కల్యాణ్

అన్యం గోవిందు మరణం జనసేనకు తీరని లోటు: పవన్ కల్యాణ్

'జనసేన నాయకులు, విద్యాదాత, సమాజ సేవకులు శ్రీ అన్యం గోవిందు గారు అకాల మరణం జనసేనకు తీరని లోటు. ఆయన మృతి నన్ను తీవ్రంగా బాధించింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని కాజులూరు గ్రామానికి చెందిన శ్రీ గోవిందు గారు నిత్యం ప్రజల సంక్షేమం కోసం శ్రమించేవారు. ఆయన చేసిన దానధర్మాల వల్ల ఆయన గొప్ప మానవతావాదిగా, విద్యాదాతగా  స్థానిక ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేశారు. తన ఇంటిని జనసేన పార్టీ కార్యాలయంగా మార్చి వేసి ఆయన పార్టీకి చేసిన సేవలు మరువరానివి. గోవిందు గారు వంటి వ్యక్తి జనసేన లో ఉన్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉండేది. అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం అయన కుటుంబ సభ్యులకే కాక  మనందరికీ  తీరని లోటు. ఈ సందర్భంగా శ్రీ గోవిందు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన శ్రేణుల తరఫున సంతాపం తెలుపుతున్నాను.' అంటూ పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Janasena
Pawan Kalyan

Watch Today's Deals on Amazon

More Press News