జర్నలిస్టులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి:అల్లం నారాయణ

జర్నలిస్టులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి:అల్లం నారాయణ
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. న్యూడిల్లీలో మరో ఇద్దరు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినందున ఆ ఇద్దరు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడిన 13 మంది జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. జర్నలిస్టులందరూ ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జర్నలిస్టులు అప్పమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రాణం కన్న విలువైనది ఏది లేదన్నారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
Allam narayana
Corona Virus

Watch Today's Deals on Amazon

More Press News