వినోద్ కుమార్ తో ఎన్ఐఆర్డీ డీజీ భేటీ!

 వినోద్ కుమార్ తో ఎన్ఐఆర్డీ డీజీ భేటీ!
  • ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎన్.ఐ.ఆర్.డీ ( NIRD ) డీజీల భేటీ
  • పీ.ఆర్., గ్రామీణాభివృద్ధిపై చర్చ
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఎన్.ఐ. ఆర్. డీ అండ్ పీ.ఆర్ డైరెక్టర్ జనరల్  డాక్టర్ డబ్యు. ఆర్. రెడ్డి ఆహ్వానం మేరకు ఆయనతో గురువారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ లోని సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన వినోద్ కుమార్ ను డైరెక్టర్ జనరల్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ పలు అంశాలపై డైరెక్టర్ జనరల్ రెడ్డి తో సమాలోచనలు జరిపారు. రానున్న రోజుల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై అనుసరించాల్సిన నూతన విధానాల ఆచరణ వంటి పలు అంశాలపై వినోద్ కుమార్ చర్చించారు.
Hyderabad

Watch Today's Deals on Amazon

More Press News