కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
హైదరాబాద్: భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం అన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం ప్రకటించారు. సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడంతో పాటు, అంత్యక్రియల వరకు ప్రతీ కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీష్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.  

కర్నల్ సంతోష్ బాబు మరణంపై రాష్ట్ర జైళ్లు, అగ్నిమాపక మరియు సైనిక్ వెల్ఫేర్ శాఖ మంత్రి మహమ్మద్ మహమ్మద్ అలీ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట ప్రాంతానికి చెందిన సంతోష్ బాబు కర్నల్ గా భారతదేశానికి సేవలందిస్తూ గాల్వాన్ వ్యాలీ లో వీరమరణం పొందటం శోచనీయమన్నారు. అతి చిన్న వయసులో కర్నల్ స్థాయికి ఎదిగి భారత దేశ రక్షణ పాటుపడి తన ప్రాణాలను త్యాగం చేసిన సంతోష్ బాబు ధన్య జీవి అన్నారు. ఆయన తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు హోంమంత్రి తన సానుభూతిని తెలియజేశారు.
KCR
Telangana

Watch Today's Deals on Amazon

More Press News