గుత్తా సుఖేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్!

గుత్తా సుఖేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్!

తెలంగాణ శాసన మండలి సభ్యునిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డిని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంట్ సభ్యునిగా, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా, పలు కీలక పదవుల్లో పనిచేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీకి చేసిన సేవలను గుర్తించుకొని మంచి అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటాలో అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా రాజేశం గౌడ్ మాట్లాడుతూ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన వారిలో చొప్పదండి మాజీ శాసనసభ్యులు, కోడూరు సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana
TRS
Telangana SFC

Watch Today's Deals on Amazon

More Press News