ఉపరాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న వెంకయ్య నాయుడు!

ఉపరాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న వెంకయ్య నాయుడు!
ఉపరాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీలోని విజయవాడలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. 'నా రెండేళ్ళ పదవీ కాలం పూర్తైన సందర్భంగా మీరు నిర్వహిస్తున్న ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో మీ అందరి ఆప్యాయత మరచిపోలేనిది. ఓ రైతు బిడ్డగా వ్యవసాయం ఎప్పుడూ నా మనసుకు దగ్గరగా ఉంటుంది. రైతుల సమస్యలకు పరిష్కారం కోసం, అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు మార్గాలను అన్వేషించే దిశగా నిరంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, ఇతర నిపుణులతో నిరంతం చర్చాగోష్టులు నిర్వహిస్తున్నాను. ఉపరాష్ట్రపతిగా కేవలం నామమాత్రపు విధులకే పరిమితం కావాలని నేను ఏనాడూ అనుకోలేదు. ఈ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే కొత్త చైతన్యాన్ని ప్రేరేపించడానికి, ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి, పరిష్కారాల కోసం సలహాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా' అని వెంకయ్య నాయుడు తెలిపారు. 
Venkaiah Naidu
Completion Of Two Years

Watch Today's Deals on Amazon

More Press News