హైదరాబాద్ శివారులో నేల కూలిన నిర్మాణంలో ఉన్న మరో భవనం

హైదరాబాద్ శివారులోని నానక్ రాంగూడలో ఇటీవలే నిర్మాణంలో ఉన్న ఏడు అంత‌స్తుల భ‌వ‌నం కూలి 12 మంది కూలీల ప్రాణాలు తీసిన ఘ‌ట‌న నుంచి తేరుకోక‌ముందే  నేడు ఉప్పల్ లో నిర్మాణంలో ఉన్న మ‌రో భవనం  కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో భ‌వ‌నంలో ప‌నిచేస్తోన్న‌ ముగ్గురు కూలీలకు తీవ్ర‌గాయాల‌య్యాయి. క్షతగాత్రులను వెంట‌నే ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి తరలించిన పోలీసులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న‌ రెస్క్యూ  సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్య‌ల్లో పాల్గొంటున్నారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.
Go Back to Shorts
building collapsed

More Telugu News