దోషులకు ఉరిశిక్ష పడడం పట్ల ఆనందం... దిల్సుఖ్ నగర్ లో స్వీట్లు పంచుకున్న ప్రజలు
మూడున్నరేళ్ల క్రితం జరిగిన దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు ఈ రోజు ఎన్ఐఏ న్యాయస్థానం మరణశిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు దిల్సుఖ్నగర్లో ప్రజలు స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. 'భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు చేస్తూ దోషులకు సరైన శిక్ష పడిందని అన్నారు. ఎన్ఐఏ కోర్టు నుంచి మంచి తీర్పు వచ్చిందని అన్నారు. బాంబు పేలుళ్లలో గాయాలపాలయిన బాధితులు కూడా కొందరు అక్కడకు చేరుకొని హర్షం వ్యక్తం చేశారు. దోషులకు మరణశిక్షే సరైందని అన్నారు.