తెరపైకి రవితేజ తనయుడు మహాధన్!

ఈ ఏడాది రవితేజ రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. అందులో ఒకటి 'రాజా ది గ్రేట్' అయితే .. రెండవ సినిమా 'టచ్ చేసి చూడు'. ఈ రెండింటిలో 'రాజా ది గ్రేట్' విడుదలకి ముస్తాబవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అక్టోబర్ 12వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సినిమా ద్వారా రవితేజ తనయుడు 'మహాధన్' పరిచయమవుతుండటం విశేషం. ఇందులో చిన్నప్పటి రవితేజగా మహాధన్ కనిపించనున్నాడట. రవితేజ తన ఫ్యామిలీతో కలిసి ఫంక్షన్స్ కి వెళ్లే సందర్భాలు చాలా తక్కువ. అందువలన ఆయన పిల్లల గురించి చాలామందికి తెలియదు. అలాంటిది రవితేజ ఒక్కసారిగా తన తనయుడిని వెండితెర ద్వారా పరిచయం చేస్తుండటం విశేషం. భవిష్యత్తులో ఈ కుర్రాడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా వున్నాయి.    
Go Back to Shorts
raviteja
mehreen

More Telugu News