సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  ఒకసారి సెట్లోకి అడుగు పెడితే ఇక ఇతర విషయాలన్నీ మరచిపోతానని అంటోంది అందాలభామ కాజల్ అగర్వాల్. "నేను ఏ విషయం అయినా అంతే... దానిపై పూర్తిగా దృష్టి పెడతాను. సెట్లోకి వచ్చానంటే ఇక అదే నా ప్రపంచం. మిగతా విషయాలన్నీ మరచిపోతాను. అలా వున్నప్పుడే పాత్రకి న్యాయం చేయగలుగుతాం. నన్నెవరైనా నటనకు సంబంధించి సలహా అడిగితే ఇదే చెబుతాను' అని చెప్పింది కాజల్.        
*  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని కుంభకోణంలో జరుగుతోంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ దృశ్యాలను కూడా చిత్రీకరిస్తున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది.
*  యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ హైదరాబాదులో మొదలైంది. కన్నడలో హిట్టయిన 'కిర్రిక్ పార్టీ'కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ భామ సంయుక్తా హెగ్డే ఇందులో ఒక హీరోయిన్ గా నటిస్తోంది.     
Go Back to Shorts
Kajal
nikhil

More Telugu News