ఆంధ్రప్రదేశ్ కు ముప్పు ముంచుకొస్తోంది...పంటలు కాపాడుకోవాలి: చంద్రబాబునాయుడు

  • తుపాను హెచ్చరికలు చేసిన చంద్రబాబు
  • అక్టోబర్ మూడో వారం నుంచి నవంబర్ మొదటి వారంలోపు మూడు తుపాన్లు
  • నష్టాన్ని అంచనావేసి, పంటలు కాపాడుకోవాలి
  • కాఫర్ డ్యాం పనులు నవంబర్ నుంచి మొదలు పెడతాం
  • పవర్ హౌస్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపానుల ముప్పు పొంచి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరికలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ మూడవ వారం నుంచి నవంబర్ మొదటి వారంలోపు మూడు తుపానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చుట్టుముట్టనున్నాయని ఇస్రో హెచ్చరికలు జారీ చేసిందని ఆయన చెప్పారు. ఈ తుపానుల నష్టాన్ని ముందుగానే అంచనా వేసి, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. కాఫర్ డ్యాం పనులు ఈ నవంబర్ నుంచి ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. అలాగే పవర్ హౌస్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని ఆయన తెలిపారు. 

polavaram
chandrababunaidu
cyclone warning

More Telugu News